వైసిపి అధినేత వైఎస్ జగన్‌పై దాడిచేసిన తన తమ్ముడు శ్రీనివాస్ జగన్‌కు వీరాభిమాని అని అతడి సోదరుడు వెల్లడించారు. అలాంటిది అతడే ఇలా జగన్ పై దాడి చేశాడంటే నమ్మలేకపోతున్నానన్నారు. జగన్ పై అభిమానంతో సంక్రాంతి పండగ సందర్భంగా ఆరడుగుల జగన్ కటౌట్ ఏర్పాటు చేసిన తన సోదరుడే ఇలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదన్నారు. అయితే తన సోదరుడు శ్రీనివాస్ మానసిక ఆరోగ్యం సరిగానే ఉందని, అతడికి ఎలాంటి సమస్యాలేదన్నారు. నిందితుడు శ్రీనివాస్ ది తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం ఠానేలంకగా గుర్తించిన సంగతి తెలిసిందే.