గురువారం పెట్రోలు, డీజిల్ ధరలు ఇలా..!

2018-10-25 113

Fuel prices witnessed further reduction on Thursday, providing some relief to consumers from relentless rate hikes.
#Petrol
#dieselprices
#metrocities
#increase
#lpg
#lpgprice
#lpgcylinder

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు గురువారం (అక్టోబరు 25) కూడా దిగొచ్చాయి. పెట్రోలు ధర 15 పైసలు, డీజిల్ ధరలు 5 పైసల మేర తగ్గాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర రూ.81.10 కి చేరింది. డీజిల్ రూ.74.80 కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోలు ధర రూ.86.58 కి చేరింది. డీజిల్ ధర రూ.78.41 కి చేరింది. ఇక హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర రూ.85.98 కి చేరగా, డీజిల్ ధర రూ.81.36 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 76 డాలర్ల దిగువకు ట్రేడ్ అవుతోంది. ఈ నెలలో బ్యారెల్ ధర 86 డాలర్లకు ట్రేడ్ అయిన సంగతి తెలిసిందే.

Videos similaires