యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' ఫస్ట్ వీకెండ్ రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన నేపథ్యంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్‌తో పాటు చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ... ఈ సినిమా బెంజ్ కారు లాంటిదని, దానికి ట్రాక్టర్ టైర్ వేస్తే బావుండదు కాబట్టి తన కామెడీ తగ్గించారని, దాని వల్లే సినిమా అంత నీట్‌గా వచ్చిందని తెలిపారు. తన కామెడీ తక్కువైందని అంటున్న వారికి నేను చెప్పే సమాధానం ఇదే అని సునీల్ స్పష్టం చేశారు. దీని తర్వాత సునీల్ తన స్నేహితుడు త్రివిక్రమ్ గురించి చేసిన కామెంట్స్ విని అంతా బిత్తరపోయారు. కొందరికి ఇది ఓవర్ అనిపించినా... చాలా మంది ఎంజాయ్ చేశారు.