బాలీవుడ్ పరిశ్రమలో తనుశ్రీ దత్తా ఆరోపణలతో మొదలైన #మీటూ ఉద్యమం ఉధృతంగా మారి సౌత్ ఇండస్ట్రీకి సైతం విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు నానా పాటేకర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగికంగా వేధించాడని ఆమె చేసిన ఆరోపణలకు సంచలనం అయ్యాయి. పలువురు సెలబ్రిటీలు ఆమెకు మద్దతుగా నిలవడంతో పాటు తమకు ఎదురైన వేధింపుల అనుభవాలను #మీటూ ఉద్యమంలో భాగంగా వెల్లడిస్తూ ఇండస్ట్రీలో ఉన్న ప్రిడేటర్స్(సెక్సువల్ వేధింపులకు పాల్పడిన వ్యక్తులు) గురించి బయట పెడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఈ పరిణామాలపై శ్రీరెడ్డి స్పందించారు.
#SriReddy
#metoo
#samantha
#tanushreedutta