Petrol, Diesel Prices At Record Highs, Rs 91.08 per Liter In Mumbai

2018-10-01 328

Petrol, diesel prices hit another record high on Monday as the upward trend in fuel prices continued. Petrol prices were increased by 24 paise per litre while diesel prices were hiked by 30 paise across the four metro cities.
#Petrol
#Diesel
#Price Hike
#New Delhi
#Mumbai
#Ap
#Telangana
#Metro Cities

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రూపాయి పతనం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావంతో చమురు మార్కెటింగ్ సంస్థలు దేశీయ మార్కెట్‌లో రోజుకింత ధరల్ని పెంచుతూపోతున్న విషయం తెలిసిందే. వరుసగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలు సోమవారం కూడా పెరగడంతో ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.91.08కి చేరుకుంది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ.79.72కి చేరుకుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను మరోమారు పెంచడంతో లీటరు పెట్రోల్‌పై 24పైసలు, డీజిల్‌పై 32పైసలు పెరిగింది.
దేశంలోని మిగతా ప్రధాన నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, చెన్నైలలో కూడా ఇంధన ధరలు పైకి ఎగబాకాయి. మునుపటి గరిష్ట స్థాయి ధరల కంటే ఇది అత్యధికం. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.83.49, కోల్‌కతాలో రూ.85.30, చెన్నైలో రూ.86.80గా ఉంది.
హైదరాబాద్‌లో పెట్రోల్‌ లీటరు ధర రూ. 88.77గాను, డీజిల్‌ ధర 81.68 గా ఉంది. విజయవాడలో లీటరు పెట్రోలు ధర రూ.87.78, డీజిల్‌ ధర రూ. 80.37. కాగా, గత అగస్టు 16వ తేదీ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. యూఎస్ డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రోజురోజుకి బలహీనపడుతుండటం కూడా ఇంధన ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.