gritty bangladesh stun pakistan by 37 runs to set up asia cup final date with india.Ms Dhoni creates another record in afghanistan vs india match.
#pakvsbangladesh
#indiavsafghanistan
#msdhoni
#asiacup2018
#india
#asiacup
#dhoni
#dhavan
#rohitsharma
ఆసియా కప్‌లో భాగంగా సూపర్-4లో మంగళవారం ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనికి 200వ వన్డే కావడం విశేషం. టోర్నీలో టీమిండియా ఇప్పటికే ఫైనల్‌కు చేరడంతో కెప్టెన్ రోహిత్ శర్మకి ఈ మ్యాచ్ నుంచి టీమిండియా మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది.
దీంతో ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని బాధ్యతలు చేపట్టాడు. అతడు 696 రోజుల తర్వాత మరోసారి టీమ్‌కు కెప్టెన్సీ వహించాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత దాదాపు రెండేళ్లకు మరోసారి ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం ఆశ్చర్యం కలిగించింది. ఈ మ్యాచ్‌తో ధోని ఖాతాలో మరో రికార్డు చేరిందని ఐసీసీ ట్వీట్ చేసింది.