బీజేపీ ఎంపీ కాళ్లు కడిగి, ఆ నీరు తాగిన కార్యకర్త, ఎందుకంటే?

2018-09-17 110

Godda BJP MP Nishikant Dubey has landed himself in controversy for allowing a party worker to wash his feet and then drink the water that was used for washing the feet.
#BJPMP
#NishikantDubey
#wash
#drink
#water


బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పాదాలను ఓ కార్యకర్త కడిగారు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగు చూసింది. ఇందులో పవన్ షా అనే బీజేపీ కార్యకర్త.. సదరు ఎంపీ కాళ్లు కడిగి, ఆ నీళ్లను తాగారు. ఈ సంఘటన జార్ఖండ్‌లోని కనహ్వారా గ్రామంలో చోటు చేసుకుంది. ఎంపీ ఓ బ్రిడ్జి నిర్మాణ పనుల విషయమై గ్రామానికి వచ్చారు. ఈ సమయంలో ఎంపీని ప్రసన్నం చేసుకునేందుకు కార్యకర్త తాంబాలంలో పాదాలు కడిగి నీళ్లు తాగాడు. నేతలను ప్రసన్నం చేసుకునేందుకు కిందిస్థాయి కార్యకర్తలు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తారు. ఇది మాత్రం అందర్నీ విస్తుగొలుపుతోంది.

Free Traffic Exchange

Videos similaires