Movie Artists Association Calls For Emergency Executive Meeting

2018-09-03 1,078

The Movie Artists Association is facing a lot of unnecessary rumors in the recent times. The association is facing regarding the funds utilized for organizing the events in the USA. Regarding this issue, MAA members said that there is no truth in the news.
#MovieArtistsAssociation
#sivajiraja
#naresh
#USA
#MAAmembers
#naresh
#hema

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'లో విభేదాలు భగ్గుమన్నాంటూ.... రెండు మూడు రోజులుగా మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఓ ప్రముఖ పత్రికలో మా అధ్యక్షుడు శివాజీ రాజాకు, ప్రధాన కార్యదర్శి నరేష్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుందంటూ వార్తలు వచ్చాయి. నిధులు దుర్వినియోగం చేస్తున్నారని నరేష్ ఆగ్రహంగా కార్యాలయానికి వెళ్లారని, రికార్డులను సీజ్ చేశారని, ఆఫీసుకు తాళం వేశారంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. దీంతో పాటు శివాజీ రాజా తన పదవికి రాజీనామా చేసినట్లు సైతం పుకార్లు షికార్లు చేశాయి. ఈ వార్తల నేపథ్యంలో 'మా' ఎగ్జిక్యూటివ్ కమిటీ అత్యవసరంగా సమావేశం అవ్వడం కూడా మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. దీనిపై 'మా' సభ్యులు వివరణ ఇచ్చారు.