ఇక క్రియాశీల రాజ‌కీయాల్లోకి జూనియ‌ర్ ఎన్టీఆర్..?

2018-08-31 1,198

A new demand coming out from Telugudesam party activists that junior ntr has to participate in active politics. party cadre demanding that the polit buero post has to give ntr and welcome him into the party. but junior has hand full of movies. will take time to junior to participate in active politics.
#tdp
#chandrababunaidu
#nandamurifamily
#politics
#balakrishna
#juniorntr
#NTR
#NaraLokesh


తెలుగుదేశం పార్టీలో జూనియ‌ర్ ఎంటీఆర్ శ‌కం ప్రారంభం కాబోతుందా అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. జూనియ‌ర్ ఎంటీఆర్ ని క్రియాశీల రాజ‌కీయాల్లోకి తీసుకుని పార్టీలో నూత‌న ఛ‌రిష్మాని నింపేందుకు అంత‌ర్గతంగా క‌స‌రత్తు జ‌రుగుతున్న తెలుస్తోంది. నంద‌మూరి హ‌రిక్రిష్ణ అకాల మ‌ర‌ణంతో అటు తెలుగుదేశం పార్టీతో ఇటు నంద‌మూరి కుటుంబంలో విషాద ఛాయ‌లు అలుముకున్న విష‌యం తెలిసిందే..! హ‌రిక్రిష్ణ మ‌ర‌ణంతో ఖాళీ ఐన పొలిట్ బ్యూరో స్థానాన్ని కూడా జూనియ‌ర్ ఎంటీఆర్ కి క‌ట్ట‌బెట్టే అంశం పై పార్టీలో లోతైన చ‌ర్చ జ‌రుతున్న‌ట్టు తెలుస్తోంది. ఒక ప‌క్క తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న జూనియ‌ర్, మ‌రోప‌క్క రెండేళ్ల వ‌ర‌కూ ఖాళీ లేకుండా క‌మిట్ ఐన సినిమాలు చేతిలో ఉండ‌టంతో జూనియ‌ర్ రాజ‌కీయ ప్ర‌వేశం కొంత ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలు కూడా క‌నిపిస్తున్నాయి.