దుర్గమ్మ చెంతకు విచ్చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి....!

2018-08-31 343

Andhra Pradesh chief minister N Chandrababu Naidu and his Karnataka counterpart HD Kumaraswamy met in Vijayawada for about 40 minutes on Friday. They discussed about the need to bring regional parties together to defeat the NDA government in the next election.
#chandrababunaidu
#vijayawada
#kumaraswamy
#andhrapradesh
#amaravati
#karnataka
#lagadapatirajagopal
#kanakadurga


కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కనకదుర్గమ్మ దర్శనం కోసం విజయవాడకు వచ్చారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్ లక్ష్మీకాంతం, మాజీ ఎంపీ లగడపాటి, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తదితరులు స్వాగతం పలికారు.దుర్గమ్మను దర్శించుకునే ముందు విజయవాడ గేట్ వే హోటల్‌కి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కుమారస్వామితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గేట్‌వే హోటల్‌లో సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటు వీరి భేటీ సాగింది. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు దేవినేని, ప్రత్తిపాటి, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చిత్తూరు పర్యటనకు వెళ్తూ మధ్యలో ఆగి కుమారస్వామితో సీఎం సమావేశమయ్యారు.