Asian Games 2018: Manjit Singh Wins Gold, Jinson Johnson Silver In Men’s 800m

2018-08-29 463

As he left the last corner and entered the home straight, all eyes were on Jinson Johnson.The 27-year-old had broken Sriram Singh’s 42-year-old national record a couple of months ago and on Tuesday evening, he appeared set to convert his Asian lead into his maiden Asian Games 800m gold at the GBK Main Stadium here.
#AsianGames2018
#Johnson
#ManjitSingh
#GoldMedal
#Jakarta
#India

అంచనాలను నిజం చేస్తూ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల జోరు మరో రోజు కొనసాగింది. మంగళవారం కూడా అథ్లెటిక్స్‌ నుంచే భారత్‌ ఖాతాలో స్వర్ణ పతకం చేరింది. పురుషుల 800 మీటర్ల పరుగులో మన్‌జీత్‌ సింగ్‌ అగ్రస్థానంలో నిలిచి పసిడి సొంతం చేసుకున్నాడు. 1 నిమిషం 46.15 సెకన్లలో అతను రేసు పూర్తి చేశాడు. భారత్‌కే చెందిన జిన్సన్‌ జాన్సన్‌ (1ని. 46.35 సెకన్లు) రెండో స్థానంలో నిలిచి రజతం సాధించాడు. అబూ బకర్‌ (ఖతర్‌–1ని. 46.38 సెకన్లు) కాంస్యం అందుకున్నాడు. మన్‌జీత్‌ అగ్రస్థానం స్పష్టంగా ఖరారు కాగా, ఇతర పతక విజేతలను ఫొటోఫినిష్‌ ద్వారా తేల్చారు. 1982 ఢిల్లీ ఆసియా క్రీడల్లో ఛార్లెస్‌ స్వర్ణం గెలుచుకున్న తర్వాత 800 మీటర్ల పరుగులో భారత్‌కు ఇదే తొలి పసిడి కావడం విశేషం. ఇదే జకార్తాలో జరిగిన 1962 ఏషియాడ్‌లో దల్జీత్, అమ్రిత్‌ పాల్‌ రజత, కాంస్యాలు సాధించిన తర్వాత 800 మీటర్ల పరుగులో ఇద్దరు భారత అథ్లెట్లు పతకాలు నెగ్గడం కూడా ఇదే మొదటిసారి.