The Election Commission is reportedly averse to holding early polls for the Telangana Legislative Assembly in December along with four states as sought by Chief Minister K. Chandrasekhar Rao. The EC is learnt to have cited “three reasons” which are obstructing early elections for Telangana state when chief adviser to the government Rajiv Sharma met its officials three days ago.
#earlyelections
#kcr
#loksabhaelections
#electioncommission
#assemblypolls
#ktr
#TRS
తెలంగాణలో ముందస్తు ఎన్నికల వార్త జోరుగా షికారు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఢిల్లీలోనే పర్యటిస్తుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రం ఈసీ సనద్ధంగా లేనట్లు సమాచారం. తెలంగాణలో తాము ముందస్తు ఎన్నికలు ఎందుకు నిర్వహించ లేక పోతున్నామనేదానిపై ఈసీ మూడు కారణాలు చూపింది.
2019 జనవరి 1న తెలంగాణలోని ఓటరు నమోదు కార్యక్రమం ముగుస్తుంది. దీన్ని ఒకసారి రివైజ్ చేయాల్సి ఉంటుంది. రెండోది ఏడు మండలాలను ఏపీలో కలిపారు. ఆ మండలాలకు తెలంగాణ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వాటిని ఆంధ్రప్రదేశ్‌లోని నియోజకవర్గాలతో కలపాల్సి ఉంది. ఇక మూడో కారణంగా... 1999 నుంచి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు రెండు ఒకే సారి జరుగుతుండగా... ఈ సారి ఆ పద్ధతికి స్వస్తి చెప్పాలన్న తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ సంతృప్తికరంగా లేదని తెలిపింది.