God's own country Kerala is up against nature's fury, and the misery is growing by leaps and bounds. Flood waters have destroyed more areas of the state, a popular tourist hotspot, bringing general life and economic activities to their knees. According to reports, tea, coffee, cardamom and rubber planters have already run up losses to the tune of Rs 600 crore so far.
దేవుని సొంత దేశం కేరళను వరదలు ముంచెత్తుతున్నాయి. వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. భారీ వర్షాలకు కేరళ అంతే భారీగా నష్టపోయింది. మంచి పర్యాటక ప్రాంతమైన కేరళ ఇప్పుడు వరదలతో అందవిహీనంగా తయారైంది. ప్రకృతి ప్రకోపానికి పర్యాటక ప్రాంతాలన్ని చెదిరిపోయాయి. దీంతో భారీగా నష్టం వాటిల్లింది. ఇప్పటికే టీ, కాఫీ, రబ్బర్, యాలకులు సాగు చేసేవారికి దాదాపు రూ. 600కోట్లు నష్టం వాటిలిన్నట్లు తెలుస్తోంది.
వరదల వల్ల రాష్ట్రానికి రూ. 8,316 కోట్లు నష్టం వాటిల్లినట్లు కేరళ సీఎం పినరాయి విజయన్ తెలిపారు.ఆగష్టు 12వ తేదీన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కేరళ పర్యటనకు వచ్చిన సమయంలో పినరాయి విజయన్ ఓనివేదక అందజేశారు. వరదల తర్వాత కేరళ మరో విధంగా ఉంటుందని ఓ బడా ఇన్వెస్టర్ చెప్పారు. "వందేళ్లుగా ఇలాంటి దుస్థితిని కేరళ ఎప్పుడూ ఎదుర్కోలేదు. ప్రస్తుతం పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినట్లుగానే కనిపిస్తోంది. మూడు రోజుల పాటు ప్రజలు అల్లాడిపోయారు. కొన్ని వేలమంది వివిధ ప్రాంతాల్లో ఇరుక్కుపోయారు. ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ వరద ఉధృతి పెరిగితే చనిపోతామనే భయం వారిలో నెలకొంది. అయితే కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ, నేవీ దళాలు చాలా సహకారాన్ని అందిస్తున్నాయి. ప్రజలు సర్వం కోల్పోయారు" అని ఆ ఇన్వెస్టర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
#keralafloods
#cardamom
#rubber
#muthootfinance
#copra
#pinarayivijayan
#southindianbank