కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్‌లో భారీ చోరీ

2018-08-14 1

మనదేశంలో బ్యాంకులను కొల్లగొట్టడం సర్వసాధారమైపోయింది. ఇప్పటికే బ్యాంకులను చోరీ చేసేందుకు దుండగులు సరికొత్త సాంకేతికతను వినియోగిస్తున్నారు. తాజాగా పూణే వేదికగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్‌లో భారీ చోరీ జరిగింది. అయితే దుండగులు నేరుగా బ్యాంకుకు వచ్చి డబ్బును దోచుకోలేదు.. ఆన్‌లైన్‌లోనే మొత్తం పనికానిచ్చేశారు. గంటలోనే 94 కోట్ల రూపాయలు దేశంలోని ఇతర బ్యాంక్ అకౌంట్లలోకి దేశం బయట ఉన్న అకౌంట్లలోకి బదిలీ చేశారు. powered by Rubicon Project భారత్‌లో రెండో అతిపెద్ద కోఆపరేటివ్ బ్యాంక్‌గా పేరుగాంచిన కాస్మోస్ బ్యాంక్ సర్వర్‌ను దుండగులు హ్యాక్ చేశారు. ఆగష్టు 11, ఆగష్టు 13వ తేదీన ఈ సర్వర్‌లు హ్యాకింగ్‌కు గురైనట్లు అధికారులు వెల్లడించారు. వారు వెంటనే చతుశ్రింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆగష్టు 11న మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బ్యాంకు సర్వర్‌ను హ్యాక్ చేసిన దుండగులు దాదాపు 15వేల లావాదేవీలు చేసినట్లు గుర్తించారు. ఇందులో మొత్తం రూ.80.5 కోట్లు ఆన్‌లైన్ ద్వారా మరో విదేశీ బ్యాంకు అకౌంట్లకు బదిలీ అయ్యాయి. ఇదంతా డెబిట్ కార్డుల ద్వారా ట్రాన్స్‌ఫర్ కాగా... మరో రూ.13.92 కోట్లు స్విఫ్ట్ పద్ధతిలో బదిలీ అయ్యాయి.
#pune
#moneytransfer
#Banks
#Hongkong
#ForiegnCountries