పన్నును పూర్తిగా ఎత్తివేసే యోచనలో ప్రధాని మోడీ..?

2018-08-14 1,604

Prime minister Narendra Modi is all set to hoist the national flag on the red fort on Independence day. Since this would be his last independence day just before the 2019 elections, sources say that Modi is planning to anounce best gifts inorder to woo voters. Modi is plannig to anounce tax free to the employees. BJP says this move from Modi will definitely get them back to power.
#modi
#independenceday
#2019 elections
#incometax
#bjp
#Congress



ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే వ్యవధి ఉంది. అప్పుడే రాజకీయ పార్టీలు వారి వారి వ్యూహాలకు పదను పెట్టాయి. మళ్లీ కేంద్రంలో ప్రభుత్వంలోకి రావాలని బీజేపీ యత్నిస్తోంటే... బీజేపీని అడ్డుకుని తీరాలని విపక్షాలు అన్నీ ఏకమవుతున్నాయి. పార్టీల తీరు ఎలా ఉన్నా అల్టిమేట్‌గా ప్రజలే ఎవరు అధికారంలోకి రావాలనేది నిర్ణయిస్తారు. అలాంటి ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నేతల పాట్లు ఫీట్లు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఇక ఎన్నికలకు వెళ్లే ముందు ఇదే చివరి స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో ఎర్రకోటపై ప్రధాని మోడీ ఎలాంటి వరాలు కురిపిస్తారా అని దేశం యావత్తు ఎదురు చూస్తోంది. పెద్ద నోట్ల రద్దు నుంచి జీఎస్టీ వరకు మోడీ కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. పెద్దనోట్ల రద్దుతో అవినీతికి చెక్ పెట్టామని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నా... వాస్తవానికి అది సామాన్యుడికి నరకం చూపించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు జీఎస్టీపై ఇప్పటికీ సామాన్యుడిలో క్లారిటీ రాలేదు. ఇంత వ్యతిరేకత ఉందని మోడీ గ్రహించారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎర్రకోటపై ఆగష్టు 15న జాతీయ జెండా ఎగురవేయగానే మోడీ కీలక ఉపన్యాసం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా సామాన్య మధ్య తరగతి, పేద ప్రజలకు వరాల జల్లు కురిపించనున్నట్లు సమాచారం. ఈ సారి ప్రజాకర్షక వరాలు ప్రకటించకపోతే 2019 స్వాతంత్ర్య వేడుకల్లో మోడీ త్రివర్ణపతాకం ఎగురవేయడం అనుమానమనే చెప్పాలి.