పోలీసులు హెచ్చరించినా అదే పని.... అది శ్రీరెడ్డి వీడియోనా? కాదా?

2018-08-10 3,914

ప్రమాదాలకు కారణం అవుతున్న 'కికి' ఛాలెంజ్ మీద పోలీసులు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎవరైనా ఇలాంటి ఛాలెంజ్ వీడియోలు పోస్టు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హీరోయిన్ రెజీనా ఇటీవల కికి ఛాలెంజ్ వీడియో పోస్టు చేయగా ఆమెను ఈ విషయంలో మందలించారు కూడా. దీంతో వేలం వెర్రిగా మారిన ఈ ఛాలెంజ్ జోలికి పోవడానికి కూడా చాలా మంది భయ పడుతున్నారు. అయితే పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా శ్రీరెడ్డి కికి ఛాలెంజ్ వీడియో పోస్టు చేశారు.