Angad Bedi Denies Neha Dhupia's Pregnancy Rumours

2018-08-07 2,567

In media, stories began doing the rounds that Neha was pregnant, which is why she and Angad rushed into marriage. Her loose clothing at recent appearances only fanned the further. But Angad Bedi has denied pregnancy news, According to a report in DNA, Neha is expecting her first child with husband Angad and the couple will make the announcement themselves as and when they are ready.
బాలీవుడ్ తార నేహా దుపియా, అంగద్ బేడి హడావిడిగా పెళ్లి చేసుకోవడంపై ఎన్నో అనుమానాలు, సందేహాలు వ్యక్తమయ్యాయి. ఎవరికీ తెలియకుండా చేసుకోవడం వెనుక అసలు కారణమనే ఓ వార్త మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం నేహా దుపియా ప్రెగ్నెంట్ అనే వార్త మీడియాలో విస్త్రృతంగా ప్రచారం జరుగుతున్నది. దీనిపై అంగద్ బేడి స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే..
నేహ దుపియా ప్రెగ్నెంట్ కాలేదు. ఈ విషయంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలనే అని అంగద్ వివరణ ఇచ్చారు. మీడియాలో వచ్చే రూమర్లను నమ్మకండి అని పేర్కొన్నారు. అయితే వాస్తవానికి నేహ గర్భం దాల్చినట్టు సన్నిహితులు ధృవీకరించడంతో ఈ అంశంపై మరో వివాదానికి దారి తీసింది.
ఇటీవల కాలంలో నేహ దుపియా లూజ్ దుస్తులు ధరించి కనిపించడంతో ప్రెగ్నెంట్ అనే వార్తలకు బలంగా మారింది. సాధారణంగా గర్భం బయటకు కనిపించకుండా మహిళలు ప్రెగ్నెంట్ సమయంలో లూజ్ దుస్తులు ధరించడం తెలిసిందే.