Sye Raa new set ready for shooting, Earlier this week, the revenue officials of Serilingampally mandal demolished the sets of Chiranjeevi starrer Sye Raa Narasimha Reddy as the filmmakers apparently did not have the required permission from the authorities.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' సినిమాకు సంబంధించిన హైదరాబాద్‌లో వేసిన సెట్ ప్రభుత్వ అధికారులు కూల్చి వేయడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిలో అక్రమంగా సెట్ వేయడంతో రంగంలోకి దిగిన గవర్నమెంట్ అఫీషియల్స్ శేరిలింగంపల్లిలో వేసిన మూవీ సెట్‌ను నేలమట్టం చేశారు. మెగాస్టార్ మూవీ, అందులోనూ ఇది ఆయన తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నది కావడంతో ఈ విషయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది.
ఈ ఇష్యూపై స్పందించడానికి చిత్ర బృందం ఇష్టపడలేదు. దీనిపై మీడియాలో రకరకాల వార్తలు వచ్చినా ‘సైరా' బృందం నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. ఏదైనా మాట్లాడితే అది మరో సమస్యకు దారి తీస్తుందనే అంతా సైలెంటుగా ఉన్నట్లు సమాచారం.
అయితే సెట్ కూల్చివేతకు కొన్ని రోజుల ముందే నిర్మాత రామ్ చరణ్‌కు అధికారుల నుండి నోటీసులు వచ్చినట్లు తెలుస్తోంది. నోటీసులు వచ్చిన వెంటనే రామ్ చరణ్ షార్ప్ డెసిషన్ తీసుకున్నారట. వెంటనే మరో చోట సెట్ వేయించారట.