Sumitra Mahajan Criticises TDP MPs For Holding Placards in Loksabha

2018-08-06 161

TDP MP Rammohan Naidu Kinjarapu raked up the issue of lack of funds from the Centre for the state of Andhra Pradesh and demanded Rs 350 crore funds be released by the government for the development of the state's backward districts.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటు సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు లోక్‌సభలో ప్లకార్డులు ప్రదర్శించడంపై స్పీకర్ సుమిత్ర మహాజన్ టీడీపీ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం మీడియాతో టీడీపీ ఎంపీలు మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు చేశారు.
ఎంపీ మురళీ మోహన్ మాట్లాడుతూ.. బీజేపీ ఏపీ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఒక్కసారైనా ఎన్నికల్లో గెలిశారా? అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావునుద్దేశించి విమర్శించారు. హోదాపై కేంద్రం ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. హోదా ఇవ్వవద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని చెప్పడం అబద్ధమని అన్నారు.
#tdp
#mps
#parliament
#Loksabha
#jcdiwakarreddy
#muralimohan