Superstar's Super Fans revealed common DP to celebrate Superstar urstrulyMahesh's birthday on Aug 9th. Made With over 900 Photoshoot Pics Of Fans & Wishes With 43 International Languages and 24 movie posters.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగస్టు 9న పుట్టిన రోజు జరుపుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానులు ఆయన కోసం వినూత్నమైన బహుమతి తయారు చేశారు. సూపర్ స్టార్‌కు ఇది 43వ పుట్టినరోజు కావడంతో 43 భాషల్లో విష్ చేస్తూ భారీ పోస్టర్ తయారు చేశారు. ఈ పోస్టర్లో మహేష్ బాబుకు సంబంధించిన 900 ఫోటోలు సైతం వాడటంతో పాటు, ఆయన ఇప్పటి వరకు నటించిన 24 చిత్రాల పోస్టర్లు సైతం పొందు పరిచారు. వినూత్నంగా ఉన్న ఈ గిఫ్ట్ ఇపుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ ఫోటోను మహేష్ బాబు ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాఫ్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో అభిమానులు తమ కామన్ డిపీగా పెట్టుకుని అభిమానాన్ని చాటు కుంటున్నారు.
#SSMBBirthdayCDP2K18
#MaheshBabu
#SSMB25
#Birthday