When the nuclear age began, there was no mistaking it. The decision by the United States to drop the world’s first atomic weapons on two Japanese cities—Hiroshima first, on Aug. 6, 1945, and Nagasaki three days later—was that rare historical moment that requires little hindsight to gain its significance.
హిరోషిమా అంటే జపనీస్ బాషలో విశాలమైన దీవి అని అర్థం. దీవుల సమాహారమైన జపాన్‌లోని అతిపెద్ద దీవిలో ఉన్న పెద్ద నగరం ఇది. ‘ఎనోలా గే’ అనే విమానం ద్వారా అమెరికన్ ఎయిర్‌ఫోర్స్ ఉదయాన్నే 8.15 గంటలకు ఈ బాంబును హిరోషిమాపై జారవిడిచింది. ఈ బాంబును మోసుకెళ్లిన విమానం ముగ్గురు సిబ్బంది మాత్రమే ఉన్నారు.
యురేనియం ఆధారితమైన ఈ అణుబాంబుకు లిటిల్ బాయ్ అనే పేరు పెట్టారు. దీని బరువు 9 వేల పౌండ్లు, పొడవు 10 అడుగులు. ఈ బాంబు నేలను తాకడానికి ముందే, 1750 అడుగుల ఎత్తులోనే పేలింది.
#littleboy
#japan
#HIROSHIMADAY
#hiroshima
#America