Mahesh Babu Wishes His Wife Namrata On Friendship Day

2018-08-06 1

Mahesh Babu shared this throwback picture of him with wife Namrata on Friendship day and captioned it as, “My friend! My world!! ❤️ #HappyFriendshipDay namratashirodkar.
నా ఫ్రెండ్, నా ప్రపంచం ఆవిడే... అంటూ నమ్రతతో కలిసి దిగిన ఓ పాత ఫోటోను ఈ సందర్భంగా మహేష్ బాబు అభిమానులతో పంచుకున్నారు.
మహేష్ బాబు పోస్టుపై నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. ‘నేను కూడా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను' అని కామెంట్‌ పెట్టారు.
నమ్రత శిరోద్కర్.... మహేష్ బాబుకు భార్య కాక ముందు మాజీ మిస్ ఇండియా, ప్రముఖ మోడల్. తెలుగులో ఆమె నటించిన తొలి సినిమా ‘వంశీ'. ఈ సినిమా సమయంలోనే మహేష్ బాబుతో ఆమె పరిచయం స్నేహంగా మారింది. దాదాపు ఐదేళ్లు స్నేహం చేసిన అనంతరం వీరు పెళ్లి చేసుకున్నారు.
మహేష్, నమ్రత పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత నమ్రత మహేష్ బాబుకు ఫుల్ సపోర్టుగా నిలిచారు. ఆయన సూపర్‌స్టార్‌గా ఎదగడం వెనక ఆమె ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. నమ్రత కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకంతో పాటు తనకు సంబంధించిన పనులు కూడా పర్‌ఫెక్టుగా చూసుకుంటుంది కాబట్టే తాను ఏ టెన్షన్ లేకుండా షూటింగులు చేయగలుగుతున్నాను అని మహేష్ బాబు అనేక సందర్భాల్లో తెలిపారు.
#FriendshipDay
#MaheshBabu
#Namrata
#MaheshbabuWife