Director Prabhakar Talks about Anchor Pradeep

2018-08-06 1,988

Director Prabhakar said that his Industry friends did not help for his latesh movie Brand Babu movie Promotions. Only Vennela Kishore, Anchor Pradeep and few others helped him.
దర్శకుడు ప్రభాకర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఇండస్ట్రీ ఫ్రెండ్స్ మీద సంచలన కామెంట్స్ చేశారు. తాను ఎంతో మందికి హెల్ప్ చేశాను. కానీ నాకు అవసరం ఉన్నపుడు ఏ ఒక్కరూ ముందుకు రాలేదని తెలిపారు. తాను దర్శకత్వం వహించిన 'బ్రాండ్ బాబు' సినిమా గురించి చాలా మందిని అడిగాను. టీజర్ ట్వీట్ చేయాలని కోరినా చాలా మంది రెస్పాండ్ కాలేదు. చాలా మంది తమ స్వార్థంగా ఆలోచించారు అని ప్రభాకర్ చెప్పుకొచ్చారు. యాంకర్ ప్రదీప్‌కు ఉన్న ఇంగితం కూడా కొంతరికి లేదని... అలాంటి సమయంలో వెన్నెల కిషోర్ లాంటి మంచి మనసున్న ఫ్రెండ్ హెల్ప్ చేశాడని తెలిపారు.
‘బ్రాండ్ బాబు' మూవీకి ఫస్ట్ లుక్ లాంచ్ చేయాలనుకున్నపుడు ఎవరితో చేయించాలని చాలా ఆలోచించాం. మారుతిని అడిగితే వెన్నెల కిషోర్‌కు ఈ విషయం చెప్పారు. ఆయన మేము అడిగిన వెంటనే ఓకే చెప్పారు. ఎందుకు నేను ఆయన పేరు ప్రత్యేకంగా చెప్పడం జరిగిందంటే.. నాకు చాలా క్లోజ్‌గా ఉండే మంచి పొజిషన్లో ఉన్న చాలా మందిని అడిగాను. రిప్లై లేదు. రిప్లై ఇస్తే నో అని చెబితే రేపు నేను ఎక్కడైనా అవసరం వస్తానేమో వారికి తెలియదు. అందుకే నో చెప్పలేరు. ఎస్ అంటే వారికి తక్కువగా అనిపిస్తుందేమో... అని ప్రభాకర్ వ్యాక్యానించారు.
ఇండస్ట్రీ బావుంటే అందరం బావుంటాం. నా సినిమా బావున్నంత మాత్రాన అందరూ బావుండరు. ఇండస్ట్రీలో ఎవరికి వారు నా సినిమా బావుంటే చాలు, నా తమ్ముడిది బావుంటే చాలు, నా బావ మరిది సినిమా బావుంటే చాలు అనుకుంటే....ప్రపంచం నలుమూలలకు తెలుగు సినిమా పాకేది కాదు. ఈ రోజు రాజమౌళి తీసిన ఒక్క సినిమా బాహుబలితో ప్రపంచంలో మన జెండా ఎగరవేశాం. జపాన్ వాళ్లు ప్రత్యేకంగా మనల్ని పిలుస్తున్నారు. ఎక్కడికెళ్లినా మేము తెలుగు అంటే బాహుబలి కదా అని వారు గుర్తు చేస్తున్నారు. ఇలా మన ఇండస్ట్రీ బావుండాలని కోరుకోవాలి.
#brandbabu
#prabhakar
#vennelakishore
#anchorpradeep
#BrandBabumoviePromotions