నేను ఎవర్నీ వేధించలేదు.. ఇదంతా రాజకీయ కుట్ర: డీఎస్ కుమారుడు సంజయ్

2018-08-03 10

తనపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణల్లో వాస్తవం లేదని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌(డీఎస్‌) కుమారుడు సంజయ్‌ అన్నారు. డీఎస్‌ తనయుడు తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరి నర్సింగ్‌ కాలేజీ విద్యార్థులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి గురువారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో సంజయ్ స్పందిస్తూ.. ‘నాపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవు. శాంకరి నర్సింగ్‌ కాలేజీ వేరే వాళ్లకు ఇచ్చాము. అక్కడికి నేను వెళ్ళలేదు. అడ్మిషన్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ కాలేజీలో ఎవరు చదువుతున్నారో కూడా తెలియదు. నాకు భార్య పిల్లలు ఉన్నారు. ఎవరితో సహజీవనం చేయడం లేదు. ఎవరో విద్యార్థినులతో అలా చెప్పించారు' అని అన్నారు.
#TRSP
#MP
#DSrinivas'sson
#DharmapuriSanjay