Biography : YS Rajasekhara Reddy Full Life History వైఎస్ఆర్ జీవితంలో కొన్ని విశేషాలు

2018-08-01 4

Yeduguri Sandinti Rajasekhara Reddy (8 July 1949 – 2 September 2009), popularly known as YSR, was a two-time Chief Minister of the Indian state of Andhra Pradesh, serving from 2004 to 2009.Reddy was elected to the 9th, 10th, 11th, and 12th Lok Sabha from the Kadapa constituency for four terms and to the Andhra Pradesh Assembly for five terms from the Pulivendula constituency. He won every election he contested.In 2003 he undertook a three-month-long paadayaatra, or walking tour of 1475 km during the very hot summer months, across several districts in Andhra Pradesh as a part of his election campaign. He led his party to victory in the following general and assembly elections held in 2004, and did the same in 2009.
#YSR
#YSRajasekharaReddy
#Jagan
#Helicopter
#Paadayatra
#Chief Minister
#Biography


యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి 1949 జూలై 8 న వైఎస్ఆర్ జిల్లా, జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు జయమ్మ, రాజారెడ్డి. ఆయన తండ్రి బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండటం వల్ల ఆయన పాఠశాల చదువంతా బళ్ళారిలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత విజయవాడ లయోలా కళాశాలలో చేరాడు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్యవిద్యలో పట్టా పుచ్చుకున్నాడు. గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్యవృత్తిని అభ్యసిస్తుండగానే కళాశాల విద్యార్థిసంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. శ్రీ వెంకటేశ్వర వైద్యకళాశాల (యెస్.వి.ఆర్.ఆర్), తిరుపతి నుంచి హౌస్‌సర్జన్ పట్టా పొందాడు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితుడైన రాజశేఖరరెడ్డి యెస్.వి.ఆర్.ఆర్ కళాశాలలో పనిచేస్తుండగానే అక్కడ హౌస్‌సర్జన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.