Niharika Konidela Gives Clarity On Tollywood Issue

2018-08-01 1,045

Niharika Konidela Gives Clear Cut Clarity on. Niharika also talk About Restrictions From Mega Fans.After the failure of her debut film 'Oka Manasu', Niharika took a huge sabbatical before signing her second Telugu film, "Happy Wedding". Happening production house UV Creations is presenting this youthful entertainer that is being bankrolled by Pocket Cinema. hero Sumanth Ashwin plays the male lead.
#NiharikaKonidela
#Shaktikanth
#RamCharan
#HappyWedding
#MegaFans
#happywedding
#happyweddingmoviereview
#July21st

మెగా డాటర్ నిహారిక నటించిన తాజా చిత్రం హ్యాపీ వెడ్డింగ్. ఈ చిత్రంలో నిహారిక, సుమంత్ అశ్విన్ జంటగా నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఎప్పుడూ చలాకీగా ఉండడం నిహారిక ప్రత్యేకత. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయం వెల్లడించింది. తమ కుటుంబంపై మెగా అభిమానుల్లో ఉన్న అభిమానం ప్రత్యేకమైనదని నిహారిక తెలిపింది.
కేవలం చిత్ర పరిశ్రమలో మాత్రమే కాస్టింగ్ కౌచ్ ఉందనడం సరైంది కాదని నిహారిక తెలిపింది. అన్ని రంగాల్లో ఇలాంటి విషయాల గురించి తాను విన్నానని, కొన్ని తనకు తెలుసు అని నిహారిక తెలిపింది.
ఏది ఏమైనా మన సమ్మతం లేకుండా ఎవడూ ఏమీ చేయలేడు. అయినా కూడా అలా చేశారు అని అంటే అది లైంగిక వేధింపులు లేదా అత్యాచారంగా పరిగణించాలని నిహారిక తెలిపింది. అంతా జరిగాక.. వాళ్ళుఆలా చేశారు..వీళ్ళు ఇలా చేసారు అని చెప్పడం సరైంది కాదు. మీరు ఓకే చెప్పకుండా ఎవ్వరూ లాక్కుని వెల్లిపొరని నిహారిక తెలిపింది.