Pawan Kalyan has accepted Chiranjeevi's challenge and planted 3 saplings at Janasena Party office in Hyderabad.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌పై వెంటనే రియాక్ట్ అయ్యారు. మెగాస్టార్ ఛాలెంజ్ స్వీకరించిన పవర్ స్టార్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్, మాదాపూర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో మూడు మొక్కలు నాటారు. కొన్ని రోజలుగా సోషల్ మీడియాలో హరితహారం ఛాలెంజ్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొంటూ ఇతర సెలబ్రిటీలకు సవాల్ విసురుతున్నారు. ఇందులో భాగంగా చిరంజీవి... తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో పాటు అమితాబ్ బచ్చన్, రామోజీరావును సవాల్ చేశారు.
#Chiranjeevi
#PawanKalyan
#JanasenaParty
#Hyderabad