లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే దోషులకు మరణదండన విధించడం సహా- లైంగిక నేరాల శిక్షలను కఠినతరం చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం లభించింది. ఏప్రిల్‌లో జారీ చేసిన అత్యవసరాదేశం స్థానంలో దీనిని సోమవారం సభలో ప్రవేశపెట్టారు. బిల్లు మూజువాణి తీర్మానంతో ఆమోదం పొందింది. చట్టాన్ని రూపొందించడానికి ఆర్డినెన్సు మార్గాన్ని ఎంచుకోవడంపై కొన్ని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే ఆ మేరకు అవి ప్రతిపాదించిన సవరణలను సభ తిరస్కరించింది.
#Loksabha
#monsoonsession
#Bill
#Jail