హఠాత్తుగా మారిన వైఎస్ జగన్‌ పాదయాత్ర రూట్ మ్యాప్

2018-07-27 3

East Godavari: There will be some changes happened in YCP Chief and Opposition leader YS Jagan Mohan Reddy East Godavari padayatra schedule.

తూర్పగోదావరి లో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైసిపి అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి పాదయాత్ర రూటు ఉన్నట్టుండి మారింది. ప్రస్తుతం పెద్దాపురంలో పర్యటిస్తున్న జగన్‌ షెడ్యూల్‌ ప్రకారం తరువాత పిఠాపురం వెళ్లాలి. అయితే ఏమైందో తెలీదు కాని జగన్ తన పాదయాత్ర రూట్ ను మార్చుకున్నారు. పిఠాపురం నుంచి కత్తిపూడి వెళ్లాల్సిన జగన్ ఇప్పుడు తన షెడ్యూల్ లో లేని జగ్గంపేట కు వెళ్లనున్నారు. అంతేకాదు ఆ నియోజకవర్గంలో మూడు రోజులు ఉండేలా జగన్ పాదయాత్ర షెడ్యూల్ ను సవరించారు. అయితే ఇప్పుడు ఈ అంశమే రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకు జగన్ తన పాదయాత్ర రూట్ మార్చుకొని ఉంటారనే విషయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Free Traffic Exchange