పాకిస్తాన్ నేత ఇమ్రాన్ ఖాన్ పై పవన్ ప్రసంశలు

2018-07-27 464

Jana Sena chief Pawan Kalyan public meeting in Bhimavaram on friday evening.
#JanaSena
#PawanKalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన పోరాట యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు భీమవరంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. భీమవరం, ఉండి నియోకవర్గాల జన సైనికులు పాల్గొననున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో పోరాట యాత్రకు భీమవరం నుంచి పవన్ స్వీకారం చుడుతున్నారు. మూడ్రోజులుగా పవన్ వివిధ వర్గాల ప్రజలతో కలిసి పలు అంశాలపై మాట్లాడారు. ఈ మేరకు జనసేన ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. గురువారం నాటి తన పర్యటనలో పవన్ పలుచోట్ల మాట్లాడారు. భీమవరంలోని డాక్టర్‌ బీవీ రాజు విద్యాసంస్థలకు వెళ్లిన పవన్ అమ్మాయిలను ఉద్దేశించి.. ఆడపడుచులకు నమస్కారం అన్నారు. ఆయన అలా అనడంతో అందరూ చప్పట్లు చరిచి, కేరింతలు కొట్టారు. తాను భీమవరంలోనే పీయూసీ పరీక్షకు హాజరయ్యానని, ప్రతి ఒక్కరికి ఒక ఆశయం అనేది ఉండాలని, ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడితేనే లక్ష్యం చేరుకోగలమన్నారు. ఈ సందర్భంగా పలువురి ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

Videos similaires