Geetha Govindam Vijay Song Deleted On Friday

2018-07-27 4

Geetha Govindam Second single "What The F" Song removed from Youtube. Geetha Govindam is directed by Parasuram, produced by Bunny Vas under the banner of GA2 pictures. It stars Vijay Deverakonda, Rashmika Mandanna in the lead roles. It is scheduled to release on 15 August 2018.
#GeethaGovindam
# BunnyVas
#RashmikaMandanna

విజయ్ దేవరకొండ తను నటిస్తున్న తాజా చిత్రం 'గీతా గోవిందం' సినిమా కోసం స్వయంగా పాట పాడిన సంగతి తెలిసిందే. 'వాట్ ది ఎఫ్' అంటూ సాగే ఈ పాట గురువారం విడుదల చేయగా యూత్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో ఈ పాటపై వివాదాలు రేగాయి. ఈ సాంగ్‌లోని లిరిక్స్ ఓ వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. చివరకు ఈ వివాదం యూట్యూబ్ నుండి పాట తొలగించే వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యూట్యూబులో 'ఈ వీడియో అందుబాటులో' లేదు అని దర్శనమిస్తోంది.
ఈ సాంగులో సీతా దేవి, సావిత్రి గురించి వచ్చిన లిరిక్స్ మీద కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడమే ఈ వివాదానికి కారణమని తెలుస్తోంది. సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న వేళ అనవసరమైన వివాదాలకు చోటు ఇవ్వకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ పాటను తొలగించినట్లు చర్చించుకుంటున్నారు.