Janhvi Kapoor Reveals Shocking Incident On Sridevi

2018-07-26 3,174

అందాల తార శ్రీదేవి మరణం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను విషాదంలోకి నెట్టింది. ఆమె మరణవార్త నుంచి చాలా మంది తేరుకోలేకపోయారు. సామాన్య ప్రజల పరిస్థితి ఇలా ఉంటే కుటుంబ సభ్యుల స్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పరిస్థితులు అలా ఉంటే, శ్రీదేవి అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజే ఆమె కూతురు జాహ్నవి ఏం చేసిందో తెలిస్తే షాక్ గురికావడం తథ్యం.
అమ్మ మరణం తర్వాత చోటుచేసుకొన్న సంఘటనలను జాగ్రత్తగా పరిశీలిస్తూ వచ్చాను. ఆమె లేరన్న లోటు రావొద్దని మానసికంగా సిద్దమయ్యాను. మనసును చాలా కఠినంగా మార్చుకొన్నాను. ఏది నా ముందుకు వస్తే దానిని అంగీకరించాలనే దృక్పథంతో ముందడుగు వేయాలని అనుకొన్నాను జాహ్నవి చెప్పారు.
కాలం, పరిస్థితులు మా చేతిలో లేకుండా పోయాయి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవాలని నిశ్చయించుకొన్నాను. ఉద్వేగ పరిస్థితుల మధ్య అమ్మ అంత్యక్రియలు జరిగిపోయాయి. నా జీవితంలో అలాంటి సంఘటనను దాచుకోవద్దని అనుకొన్నాను అని జాహ్నవి పేర్కొన్నారు.
#JanhviKapoor
#dhadak
#boneykapoor