India coach Ravi Shastri said the current team does not believe in complaining and will not make tough conditions an excuse for its performances in what is expected to be a gruelling five-Test series against England.
#ravishastri
#indiainengland2018
#cricket
#viratkohli
#TeamIndia
ఆతిథ్య ఇంగ్లాండ్‌తో కోహ్లీసేన కఠిన సవాల్‌కు సిద్ధమైంది. ఆగస్టు 1 నుంచి ఇంగ్లీషు గడ్డపై టీమిండియా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి మీడియాతో మాట్లాడుతూ తమ ముందున్న సవాల్ ప్రత్యర్థిని ఓడించడమేనని, ఈ పర్యటనలో ఫలితాలకు వాతావరణం, పిచ్‌లను కారణంగా చూపబోమని అన్నాడు.
పిచ్, ఔట్ ఫీల్డ్ చెత్తగా ఉండటంతో, అసంతృప్తితో టీమిండియా ఎసెక్స్‌తో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను మూడు రోజులకు తగ్గించుకుందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో రవిశాస్త్రి స్పందించాడు. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా గొప్పగా ఆడి, ఉత్తమ జట్టుగా నిలవడాన్ని గర్వంగా భావిస్తామని అన్నాడు. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు వార్మప్ మ్యాచ్ ఏర్పాట్లు సరిగా లేకపోవడం పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదన్నాడు.