Jana Sena chief Pawan Kalyan appeal to all for YSR Congress party chief YS Jagan Mohan Reddy's Bridegroom forever comments.
#JanaSena
#PawanKalyan
#YSRCongressparty
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను తనను బాధించాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం సోషల్ మీడియా వేదిక ట్విట్టర్లో ట్వీట్ చేశారు. తాను ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లనని, రాజకీయాలకు ఎవరి వ్యక్తిగత జీవితాలను ఉపయోగించుకోనని చెప్పారు.ప్రజలకు సంబంధించిన పబ్లిక్ పాలసీల పైనే నేను ఇతర పార్టీలతో విబేధిస్తానని తెలిపారు. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని తాను అందరినీ కోరుతున్నానని చెప్పారు. 'అందరికీ నా విజ్ఞప్తి' (మై అప్పీల్ టు ఆల్) అని పేర్కొంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.