Cristiano Ronaldo Has The Physical Attributes Of A 20-Year-Old

2018-07-26 62

It is no secret that Cristiano Ronaldo keeps his body in pristine condition. But the results of the Portuguese star's medical ahead of his move to Juventus may have left even him surprised.
#football
#cristianoronaldo
#realmadrid
#Soccer

రెండు నెలల కిందట పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో స్పెయిన్‌కు చెందిన ఎల్ చిరింగిటో అనే చానెల్‌కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో మాట్లాడుతూ.. నా వయసు 33 ఏళ్లయినా.. 23 ఏళ్ల కుర్రాడికుండే శక్తి నాలో ఉంది. నేను 41 ఏళ్ల వరకు కూడా ఫుట్‌బాల్ ఆడగలను అని అన్నాడు. ఇప్పుడు అతను చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఓ మెడికల్ స్టడీయే ఈ విషయాన్ని వెల్లడించింది.ఈ విషయంపై సాకర్ దిగ్గజం క్రిస్టియన్ రొనాల్డొ మాట్లాడుతూ..'ప్రాక్టీస్ సమయంలో నేనే టాప్‌గా ఉండాలని ప్రయత్నిస్తాను. శిక్షణ కాలంలో కఠిన శ్రమ చేయడానికి ఇష్టపడతాను. ఇంకా ఇంతకుమించి నేనేంటో నిరూపించుకోవాలసిన అవసర్లేదు. నా గురించి అందరకీ తెలుసు. కొత్తగా కనిపించాలనుకుంటాను. మార్పులను కోరుకుంటాను. ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకుని అందులో ఉండిపోవాలనుకోను. కొత్త ఛాలెంజ్‌లను స్వీకరించడాన్ని ఇష్టపడతాను. మాంచెస్టర్, రియల్ మాడ్రిడ్ క్లబ్‌ల తర్వాత చేరిన జ్యూవెంటస్‌లోనూ చరిత్ర సృష్టించి తీరతాను'.