ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా తాను ప్రవర్తించిన తీరుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అంతేగాక, దీనికి సంబంధించి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకు సభాముఖంగా క్షమాపణలు చెప్పారు.ఏపీ విభజన చట్టంపై మంగళవారం రాజ్యసభలో చర్చ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఆయనకు కేటాయించిన సమయం అయిపోయిందంటూ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆయన్ని నిలువరించారు. దీంతో విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఛైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వెల్‌లోకి దూసుకెళ్లారు. ఇలా చేస్తే సభ నుంచి వాకౌట్ చేస్తానని తీవ్రస్వరంతో హెచ్చరించారు.
Rajya Sabha Chairman M Venkaiah Naidu today cited former prime minister Manmohan Singh's speech in the House yesterday to stress that members can put forth their views without shouting, after a YSR Congress MP apologised for his behaviour.
#vijayasaireddy
#venkaiahnaidu
#noconfidencemotion
#congress