ఎపి నంబర్ వన్ గా ఉండాలి: సిఎం చంద్రబాబు

2018-07-25 36

ప్రతి ఒక్కరి జీవితంలో స్పోర్ట్స్‌ ఒక భాగం కావాలని...స్పోర్ట్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడం సమాజానికి మంచిదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడలో నిర్మించనున్న అంతర్జాతీయ క్రీడా ప్రాంగణానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ నేతలకు రాష్ట్ర, దేశస్థాయిలో మాత్రమే గుర్తింపు వస్తుందని క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు. ఐకాన్‌గా ఎదుగుతారని గుర్తు చేశారు. ప్రపంచాన్ని జయించే శక్తి క్రీడాకారులకు ఉంటుందని అన్నారు.ఆంధ్రప్రదేశ్ దేనిలోనైనా నంబర్ వన్ గా ఉండాలని...అంతే కానీ వేరే స్థానంలో ఉండటానికి వీల్లేదని చెప్పారు. ఎపి దేనిలోనైనా నంబర్ వన్‌గా ఉండాలన్నదే తన తపన అన్నారు. రాష్ట్రంలో అద్భుతమైన ప్లే గ్రౌండ్‌లను నిర్మించేందుకు మరమ్మతులు చేపడుతున్నామన్నారు.

Sports should be a part of everybody's life and Sports are good to the society, said AP Chief Minister Nara Chandrababu Naidu. CM Chandrababu Naidu laid the foundation stone for the International Sports Complex in Vijayawada.
#andhrapradesh
#vijayawada
#foundationstone
#cmchandrababu
#anilkumble