రుజువు చేస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా: పార్లమెంటులో సీఎం రమేష్

2018-07-25 195

తాను ఇప్పుడు రాజీనామా చేస్తానంటూ.. తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ మంగళవారం పార్లమెంటులో ఆవేశంగా మాట్లాడారు. రాజ్యసభలో కేంద్రమంత్రులు ప్రకాశ్‌ జవదేకర్‌, పీయూష్‌ గోయల్‌ అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన తెలుగులో మాట్లాడారు. కేంద్ర ఆర్థిక శాఖమంత్రి పీయూష్‌ గోయల్‌, మరో మంత్రి ప్రకాశ్ జవదేకర్ గతంలో చెప్పిన విషయాలనే మళ్లీ చెబుతూ విభజనకు ముందు రాష్ట్రంలో విద్యా సంస్థలు లేవన్నట్టుగా మాట్లాడటంపై రమేశ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
ప్రకాశ్‌ జవదేకర్‌ యూనివర్సిటీల గురించి చెప్పారు. ఇన్‌స్టిట్యూట్‌లన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. రాష్ట్రం కొత్తది, అక్కడ విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలంటే ఏపీ ప్రభుత్వం రూ.12 కోట్ల విలువైన స్థలం ఇచ్చింది. విద్యా సంస్థల ఏర్పాటుకు రూ.14వేల కోట్లు ఖర్చవుతుంది. ఇప్పటివరకు 8-9 సంస్థలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం కేవలం రూ.546 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇలా కేంద్రం వ్యవహరిస్తే ఏపీ విద్యార్థులు ఎక్కడికి వెళ్లి చదువుకోవాలి?' అని సీఎం రమేష్ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. అంతేగాక, నాలుగేళ్లు అయినా విద్యాసంస్థల్లో మౌలికవసతులు లేవని అన్నారు.

TDP MP CM Ramesh serious on central government for special status issue in parliament session.