Aamir Khan's Thugs Of Hindostan To Be Shot On 2 Massive Ships

2018-07-25 537

ఇండియాలో సినిమా నిర్మాణ రంగంలో చాలా మార్పులు వస్తున్నాయి. బాహుబలి మూవీ తర్వాత ఫిల్మ్ మేకర్స్ ఆలోచన పూర్తిగా మారిపోయింది. సినిమా క్వాలిటీ ప్రపంచ స్థాయిని అందుకునేలా ఎంతటి ఖర్చు పెట్టడానికైనా వెనకాడటం లేదు నిర్మాతలు. మంచి క్వాలిటీతో సినిమా అందిస్తే మంచి అద్భుతమైన ఫలితాలు సాధించవ్చనేది తేలిపోయింది.
ప్రస్తుతం బాలీవుడ్లో ప్రముఖ స్టార్స్ అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' సినిమా కోసం రెండు భారీ నౌకల సెట్స్ వేస్తున్నారు. ఈ సెట్స్‌కు సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సెట్స్ బరువు సుమారు 2 లక్షల కిలోలు ఉంటుందట.
సినిమా కథకు ఈ రెండు సెట్లు ఎంతో కీలకం కావడం వల్లనే భారీగా ఖర్చు పెట్టి మరీ ఇదంతా చేస్తున్నారట. ఈ సెట్స్ నిర్మాణంలో ఇంటర్నేషనల్ డిజైనర్స్, షిప్ మేకర్స్ తో సహా 1000 మంది సంవత్సరం పాటు కష్టపడ్డారట. యూరఫ్‌లోని మెల్టా అనే తీర ప్రాంతంలో ఈ సెట్స్ వేశారు.

Aamir Khan-Amitabh Bachchan-starrer Thugs of Hindostan, the makers constructed two massive ships weighing over two lakh kilos. A source revealed saying:Since sea and ships play an integral part in the plot, Aamir as well as Aditya Chopra were sure that they would go all out to present the biggest spectacle that Hindi cinema has ever witnessed. The film’s budgets are yet to be ascertained, but the cost for the two ships easily runs into several crores.