బిగ్‌బాస్ సెలబ్రిటీ బండ్గీ కల్‌రాపై క్రిమినల్ కేసు నమోదైంది. బండ్గీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేసిన వ్యాపార ప్రకటన కారణంగా తాను మోసపోయానని బెంగళూరుకు చెందిన యువరాజ్ సింగ్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకు ఈ వ్యవహారంలో ఏమి జరిగిందంటే...
బండ్గీ కల్‌రాను 11వ సీజన్ హిందీ బిగ్‌బాస్‌లో చూశాను. అప్పటి నుంచి ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాను. ఇటీవల ఆమె సోషల్ మీడియాలో తక్కువ ధరకే ఐఫోన్లు అనే ఒక వ్యాపార ప్రకటనను పోస్టు చేసింది.
బండ్గీ కల్‌రా పోస్టు చేసిన యాడ్‌ను చూసి తక్కువ మొత్తానికి వస్తున్నాయని రెండు ఐఫోన్ల ఎక్స్ కోసం ఆర్డర్ చేశాను. కానీ నాకు నకిలీ ఐఫోన్లు పంపారు. దాంతో నేను ఆర్థికంగా, మానసికంగా మోసపోయాను అని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో యువరాజ్ సింగ్ పేర్కొన్నారు.