వివాదాస్పద నటి శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో మకాం వేసి తమిళ దర్శకులు, హీరోలపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తనను వాడుకుని అవకాశాలు ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆమె తమిళ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెపై వ్యభిచారం, డబ్బు దోపిడీ ఆరోపణలతో ఇండియన్ మక్కల్ మంద్రం(ఐఎంఎం) అనే సంస్థకు చెందిన సభ్యుడు సిటీ పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అయింది.
శ్రీరెడ్డి చేస్తున్న పనులు భారతీయ సమాజాన్ని, సంస్కృతిని అవమానించే విధంగా ఉన్నాయని ఐఎంఎం సభ్యుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని కంప్లయింట్ చేశాడు.
సినిమా అవకాశాల కోసం దర్శకులు, యాక్టర్ల వద్ద పడుకున్నట్లు ఆమె స్వయంగా ఒప్పుకుంటోంది. ఇలా చేయడం వ్యభిచారం కిందకే వస్తుంది అని ఐఎంఎం సభ్యుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.