ఇండో కెనడా భామ సన్నీలియోన్ పోర్న్ స్టార్ గా పలు అడల్ట్ చిత్రాల్లో నటించింది. పోర్న్ స్టార్ గానే బాగా పాపులర్ అయింది. సన్నిలియోన్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమెని నిర్మాతలు బాలీవుడ్ కు తీసుకుని వచ్చారు. ఇక పోర్న్ చిత్రాలకు ఫుల్ స్టాప్ పెట్టి బాలీవుడ్ పై దృష్టి పెట్టడంతో సన్నీలియోన్ తక్కువ సమయంలోనే స్టార్ సెలేబ్రిటిగా మారిపోయింది. నిమిషాల వ్యవధిలో సాగె ఐటమ్ సాంగ్ కు సైతం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే నటిగా సన్నీలియోన్ మారిపోయింది. సన్నీ జీవితంపై బయోపిక్ వెబ్ సిరీస్ గా తెరకెక్కింది. కరంజిత్ కౌర్.. ది అన్ టోల్డ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కింది.
సన్నీలియాన్ తన బయోపిక్ లో తానే నటించింది. తన జీవిత చరిత్రపై తెరకెక్కిన బయోపిక్ వెబ్ సిరీస్ లో తానే నటించడం ఛాలెంజింగ్ విషయం అని సన్నీలియోన్ తెలిపింది.