Air India Leaves TT Team Stranded At Delhi Airport

2018-07-23 85

ఎయిర్ ఇండియా భారత క్రీడాకారుల పట్ల దారుణంగా వ్యవహరించింది. ఐటీటీఎఫ్ వరల్డ్ టూర్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో భాగంగా జరగనున్న పోటీలకు భారత్ నుంచి 17మంది క్రీడాకారులు అర్హత సాధించారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోని మెల్‌బౌర్న్ వెళ్లేందుకు బయల్దేరిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారుల బృందం విమాన ప్రయాణం కోసం ఎయిర్ పోర్టు చేరుకున్నారు. వారి టిక్కెట్లు విభిన్నమైన పీఎన్నార్‌లతో బుక్ చేసి ఉన్నాయని దాంతో పది మంది క్రీడాకారులు మాత్రమే ప్రయాణించనున్నట్లు భావించారు విమాన సిబ్బంది.ఇలా మిగిలిన టిక్కెట్లు అన్నీ అమ్మేసి విమానం ఎక్కేందుకు కేవలం పది మందికి మాత్రమే అనుమతినిచ్చారు. ఫ్లైట్‌లో ఖాళీ లేదని మిగిలిన ఏడుగురు ప్లేయర్లను వదిలేసి వెళ్లిపోయింది మెల్‌బౌర్న్ వెళ్లాల్సిన విమానం. ఇక్కడే ఉండిపోయిన వారిలో గోల్డ్ కోస్ట్ ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణంతో పాటు మరిన్ని పతకాలు సాధించి పెట్టిన మానికా బాత్రా కూడా ఉండిపోయారు.

India's table tennis star Manika Batra and six other paddlers were stranded at the Indira Gandhi International Airport after being denied boarding on a Melbourne flight by the national carrier Air India en route an international event.
#manikabatra
#tabletennis
#sports
#AirIndia
#Modi