అందం, అభినయంతో ప్రేక్షుకులని కట్టిపడేయగల సుందరి అమలాపాల్. తెలుగులో నాయక్, ఇద్దరమ్మాయిలతో, బెజవాడ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. అమలాపాల్ సినీజీవితంలో, వ్యక్తిగత జీవితంలో కూడా వివాదాలు చెలరేగాయి. కానీ వాటన్నింటినీ ధీటుగా ఎదుర్కొంటూ సినిమాల్లో నటిస్తోంది. తాజగా తనకు వచ్చిన కొన్ని బాలీవుడ్ అవకాశాలపై అమలాపాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇటీవలే అమలాపాల్ బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. అమలాపాల్ కు బాలీవుడ్ లో ఇది డెబ్యూ మూవీ. అర్జున్ రాంపాల్ ఈ చిత్రంలో హీరో. నరేష్ మల్హోత్రా దర్శకుడు.