అవిశ్వాస తీర్మానం తర్వాత ఏపీతో పాటు ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. లోక్‌సభలో మోడీ మాట్లాడిన తర్వాత అర్థరాత్రి ఏపీ సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్ శనివారం ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు వైఫల్యాలను మరోసారి ఏకిపారేశారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఆయా రాజకీయ పార్టీలు వ్యవహరించిన తీరుపై జగన్ మండిపడ్డారు. అవిశ్వాసం చర్చలో ఏపీ ప్రత్యేక హోదాపై ఒక్క నిమిషం కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసినందుకు గాను నిరసన తెలుపుతూ ఈ నెల 24న రాష్ట్ర బంద్‌కు ప్రతిపక్షనేత పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు ప్రజా సంఘాలు ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన కేంద్రానికి గట్టి సంకేతాలు పంపాలని ఆయన సూచించారు. అసలు రాష్ట్రానికి చెందిన హక్కులను తాకట్టు పెట్టేందుకు చంద్రబాబు ఎవరని జగన్ నిప్పులు చెరిగారు.