భారత్‌లో మహిళలకు రక్షణ లేదన్న కారణంగా స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ క్రీడాకారిణి భారత్‌కు వచ్చేందుకు నిరాకరించింది. చెన్నై వేదికగా జరగనున్న వరల్డ్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్ టోర్నీకి స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ ప్లేయర్‌ను పంపించేందుకు ఆమె తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు.దీంతో స్విట్జర్లాండ్‌కు చెందిన టాప్ జూనియర్ స్క్వాష్ ప్లేయర్ ఆంబ్రే అలింక్స్ భారత్‌లో జరిగే వరల్డ్ జూనియర్ ఛాంపియన్ షిప్ నుంచి తప్పుకుంది. జాతీయ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ఆంబ్రే అలింక్స్‌ను ఆమె తల్లిదండ్రులు భారత్‌లో భద్రతా కారణాలను చూపుతూ అడ్డుకోవడంతో టోర్నీ నుంచి వైదొలిగినట్లు పేర్కొన్నాయి.
#switzerland
#worldjuniorsquash
#championships
#chennaiambreallinckx