సింగర్‌గా కెరీర్ మొదలు పెట్టి పలు దక్షిణాది సినిమాలతో పాటు యమదొంగ, కేడీ, కింగ్ లాంటి తెలుగు సినిమాల్లో నటించిన మలయాళ బ్యూటీ మమతా మోహన్ దాస్ క్యాన్సర్ వ్యాధిన పడిన తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమై మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఈ మధ్య కాలంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అందంగా ఉండటం, రెచ్చగొట్టేలా ప్రవర్తించడమే మహిళలపై అఘాయిత్యాలు జరుగడానికి కారణం అని ఆమె వ్యాఖ్యానించడంపై నెటిజన్లు మండి పడుతున్నారు.
ఆడవారు ఎక్కువ అందంగా ఉండటం కూడా వారిపై అఘాయిత్యాలు జరుగడానికి ఓ కారణం. అందంగా ఉన్న అమ్మాయిలు ఈ సొసైటీలో ధైర్యంగా బ్రతకడం కష్టం అని మమతా అన్నారు.