సోనియా గాంధీతో జేసీ దివాకర్ రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు

2018-07-20 1,496

రాష్ట్రాన్ని విభజించి.. రెడ్లకు తీవ్ర అన్యాయం చేశావు.. తల్లీ అంటూ యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటులో చర్చ కోసం జేసీ ఢిల్లీలో ఉన్నారు.
పార్లమెంటు ప్రాంగణంలో జేసీ దివాకర్ రెడ్డికి సోనియా గాంధీ ఎదురుపడ్డారు. ఈ సమయంలో ఆయన ఆమెకు నమస్కరించి, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తల్లీ.. రాష్ట్రాన్ని విభజించి రెడ్లకు తీరని అన్యాయం చేశావు, తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న రెడ్లు నిలువునా మునిగారు అని వ్యాఖ్యానించారట. దానికి సోనియా ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్లారట.

It is said that Telugudesam Party MP JC Diwakar Reddy takes on UPA chairperson Sonia Gandhi for Andhra Pradesh division.
#MPJCDiwakarReddy
#SoniaGandhi