'లంచాలతో పాటు అమ్మాయిలను సరఫరా చేస్తేనే రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టులో చోటు' ఇది ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మొహమ్మద్ అక్రమ్ సైఫీపై ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి ఆరోపణ. ఈ వివరాలను హిందీ న్యూస్ ఛానెల్ 'న్యూస్1' ఓ కథనం రూపంలో ప్రసారం చేసింది. జట్టులోకి ఎంపిక చేయాలంటే డబ్బుకు లేదా దానికి బదులు అమ్మాయిలను సరఫరా చేయాలని అక్రమ్ అడిగినట్లు ఉత్తర ప్రదేశ్ క్రికెటర్ రాహుల్ శర్మ ఆరోపించాడు.