The Narendra Modi led NDA government at the Centre will face its first no-trust vote in the Lok Sabha on Friday but has more than enough numbers to prove its strength.
#noconfidencemotion
#tdp
#narendramodi
#chandrababunaidu
తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. దీంతో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అందరికీ దాదాపు అర్థమయింది. అయితే, ఇక్కడ ఒక్కటే ప్రశ్న ఉదయిస్తుంది. ఏపీకి ఇచ్చిన నిధులతో టీడీపీని బీజేపీ ఇరుకున పెడుతుందా? లేక కమలం పార్టీని తెలుగుదేశం కార్నర్ చేస్తుందా? ఇది రేపు తేలిపోనుంది.
టీడీపీ తమకు కేటాయించిన 13 నిమిషాలతో పాటు మరికొంత సమయం అదనంగా మాట్లాడి కేంద్రం నుంచి వచ్చిన నిధులు, నెరవేరని హామీలపై మాట్లాడనుంది. ఏపీకి ఇచ్చిన హామీల విషయంలో చట్టంలో ఏముంది, ఏమిచ్చాం, నాటి కేంద్ర ప్రభుత్వం ఎంత సమయంలో చేయమంటే తాము ఎంత ముందుగా చేశాం.. ఏఏ పనులు ఎంత వరకు వచ్చాయని బీజేపీ చెప్పనుంది.